namstevemulawada.in
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 2:44 am Digital Edition : NAMASTE VEMULAWADA

అగ్రహారం శ్రీ హనుమాన్ దేవాలయంలో పూజా సామాగ్రి అమ్మకానికి టెండర్ ప్రకటన

అగ్రహారం ప్రసిద్ధ శ్రీ హనుమాన్ దేవాలయం పరిధిలో భక్తులకు అవసరమైన టెంకాయలు, దీక్ష సామాగ్రి, పూజా సామాగ్రి అమ్మకానికి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో టెండర్ ప్రకటన విడుదలైంది. 2026 సంవత్సరానికి సంబంధించి దేవాలయ ప్రాంగణంలో పూజా సామాగ్రి విక్రయ హక్కుల కోసం తేదీ.13.02.2026. ఉదయం 11 గంటలకు ఆసక్తి గల అర్హులైన వ్యక్తులు / వ్యాపారులు 7 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి టెండర్లో పాల్గొనవచ్చని ఆలయ కమిటీ తెలిపింది. టెండర్కు సంబంధించిన దరఖాస్తులు దేవాలయ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని, నిర్దిష్ట తేదీ లోగా పూర్తిస్థాయి టెండర్ను అత్యధిక ధర పలికిన వారికి కేటాయించనున్నట్లు, ఆలయ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆసక్తి గల వారు ఆలయ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆలయ ఈఓ ఒక ప్రకటనలో కోరారు.