ePaper
Sunday, April 12, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణఅల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు... బర్త్‌డే వేడుకలు..*

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు… బర్త్‌డే వేడుకలు..*

📰 Generate e-Paper Clip

*తెలంగాణ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శీలం విజయ్ యాదవ్*

వేములవాడ పట్టణంలో అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకొని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెలంగాణ *రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శీలం విజయ్ యాదవ్* ఆధ్వర్యంలో వినూత్న సేవా కార్యక్రమాలతో పాటు బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల్లో గర్భాశయ సర్వైకల్ క్యాన్సర్ నివారణపై అవగాహన కల్పించేందుకు HPV వ్యాక్సిన్ పై పోస్టర్‌ను *తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్యచే* ఆవిష్కరించారు. 9 నుండి 14 ఏళ్లలోపు బాలికలకు HPV వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్‌ను సమర్థవంతంగా నివారించవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ మంచి నిర్ణయం తీసుకున్న అల్లు అర్జున్ గారిని, వారి ఫ్యాన్స్ అసోసియేషన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. బర్త్‌డే కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కొండ దేవయ్య అల్లు అర్జున్ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ చరణ్, వేములవాడ టౌన్ ఫ్యాన్స్ తిరుపతి, విక్రమ్ యాదవ్, త్రినాథ్, శ్రీపతి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!