namstevemulawada.in
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 9:35 am Digital Edition : NAMASTE VEMULAWADA

అవకాశమిస్తే 24 వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా..

-బిజెపి అభ్యర్థి రాపల్లి శ్రీధర్ హామీ

వేములవాడ మున్సిపాలిటీ 24వ వార్డు అభివృద్ధిలో వెనుకబడి ఉండటం బాధాకరమని, తనకు ఒక్క అవకాశం ఇస్తే వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బిజెపి అభ్యర్థి రాపల్లి శ్రీధర్ అన్నారు. బుధవారం ఆయన వార్డులోని పలు వీధుల్లో ప్రచారం నిర్వహించి కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. వార్డులో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని, తాను గెలిచిన వెంటనే రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తానని తెలిపారు. ప్రతి ఇంటికి సురక్షితమైన మినరల్ వాటర్ అందించే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. గతంలో సుభాష్ నగర్ తొమ్మిదో వార్డు కౌన్సిలర్ గా సేవలందించానని,తాను లయన్స్ క్లబ్ ద్వారా అనేక సామాజిక సేవలు అందించి ప్రజల మన్ననలు పొందానని గుర్తుచేశారు. గత కొద్ది రోజులుగా 24 వార్డులో ఒంటరిగానే ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నాను..ప్రజలందరూ నన్ను తమ ఇంటి కొడుకులా, అన్నలా భావిస్తున్నారు.మీ ఇంట్లో ఒక వ్యక్తిలా సేవ చేసేందుకు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి” అని ఆయన విజ్ఞప్తి చేశారు.