namstevemulawada.in
Newspaper Banner
Date of Publish : 05 February 2026, 7:48 pm Digital Edition : NAMASTE VEMULAWADA

ఆశీర్వదించండి.. ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా

25 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొక్కుల రాజు

వేములవాడ పట్టణంలోని 25వ వార్డు కౌన్సిలర్గా తనకు అవకాశం కల్పిస్తే, వార్డును అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి కొక్కుల రాజు ధీమా వ్యక్తం చేశారు.ప్రభుత్వా వీప్ ఎమ్మెల్యే అధి శ్రీనివాస్ గురువారం వార్డులో మహిళలు, యువత, వివిధ సంఘాల నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వార్డులోని అనేకమంది ప్రజలు పాల్గొని కొక్కుల రాజు కు వార్డులోని ప్రజలందరూ మద్దతు ఉంటాదని పేర్కొన్నారు సందర్భంగా ఇంటింటా తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారం సందర్భంగా కొక్కుల రాజు మాట్లాడుతూ వార్డు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని గుర్తు చేశారు. వార్డులోని ప్రతి కాలనీలో సి.సి. రోడ్లు, మురికి కాలువల నిర్మాణం చేపట్టడంతో పాటు, అర్హులకు పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు అందేలా చుస్తానాని వివరించారు. వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పదవి కోసం కాకుండా, మీ ఇంటి బిడ్డగా సేవ చేసేందుకు నిరంతరం పాటుపడతానని రాజు పేర్కొన్నారు. ఇళ్ల వద్దకు వచ్చిన కొక్కుల రాజు కు ఓటర్లు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.