*కరీంనగర్ డి పి ఆర్ ఓ ను కలసిన కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ _యెల్ల పోశెట్టి_*
తేదీ=30-3-2026 సోమవారం రోజున కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లొ రాజన్న సిరిసిల్ల ఇంచార్జి జిల్లా పౌర సంబంధాల అధికారి జి . లక్ష్మణ్ కుమార్ డి పి ఆర్ ఓ ని మర్యాదపూర్వకంగా కలిసి ప్రపంచ రంగస్థల దినోత్సవం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి చిత్రపటం, స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు అలాగే యెల్ల పోశెట్టి జన్మదిన అభినందన సంచికను అందజేయమైనది .ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం TUF కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి గాయకులు ఉత్తర తెలంగాణ కళాకారుల విభాగం కోఆర్డినేటర్ బొడ్డు రాములు రంగస్థల కళాకారుల రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల విభాగం అధ్యక్షులు వారాల దేవయ్య గాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ డప్పు నృత్య కళా కారులు.. జిల్లా కోశాధికారి బుర్రి శంకరయ్య రంగస్థల కళాకారుడు తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ ఉద్యమ కళాకారుల ప్రధాన కార్యాలయం వేములవాడ నందు రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి మాట్లాడుతూ సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సూచనల మేరకు కళాకారులకు గుర్తింపు కార్డులు జారీ చేసే దిశగా భాష సాంస్కృతిక శాఖ వెబ్సైట్ను రూపొందించింది తెలంగాణ రాష్ట్రంలోని కళాకారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కోరుచున్నాము కళాకారులకు ఇట్టి అవకాశాన్ని కల్పించిన మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఏ.రేవంత్ రెడ్డి గారికి భాషా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గార్లకు కళాకారుల రాష్ట్ర కమిటీ పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదములు తెలియజేయుచున్నాము.