ePaper
Wednesday, February 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణకాంగ్రెస్, బిజెపిలు తెలంగాణకు చేసింది ఏమీ లేదు

కాంగ్రెస్, బిజెపిలు తెలంగాణకు చేసింది ఏమీ లేదు

📰 Generate e-Paper Clip

బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేములవాడ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కాగా మరో వైపు కుల మతాల పేరుతో ఓట్లు అడుగుతూ బిజెపి ఎన్నికల అప్పుడు ఓట్లు వేయించుకుంటుందనీ
అందుకే ఈ రెండు పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలనీ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు మునిసిపల్ ఎన్నికలలో భాగంగా వేములవాడలోని పలు ప్రాంతాలలో జరిగిన కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కి ఓటు వేసి రాష్ట్రంలో కేసీఆర్ ని మరోసారి సీఎం చేసుకునే ప్రస్థానాన్ని ప్రారంభించాలనీ,ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చి అమలు చేయని కాంగ్రెస్ పార్టీని ఓడించాలని అన్నారు
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల సందర్భంగా బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చి ఆరు గ్యారెంటీలు అన్నింటిని వంద రోజుల్లో అమలు చేస్తానని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ఇచ్చిన బాండ్ పేపర్ ని ప్రజల ముందు చూపిస్తూ కేటీఆర్ మాట్లాడారు. ఈసారి తనకు ఓటు వేయకుంటే చనిపోతానని, గతంలో నాలుగు సార్లు ఓడిపోయినా అని చెప్పి సానుభూతి డైలాగులతో ఆరోజు ప్రజలను మభ్యపెట్టిన ఆది శ్రీనివాస్ ఆ తర్వాత హామీల అమలు నుంచి మొదలుకొని అభివృద్ధి వరకు అడ్రస్ లేకుండా పారిపోయాడనీ విమర్శించారు. కేవలం మంత్రి కావాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకుంటున్న ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గానికి ఏమి చేశారో చెప్పాలని అన్నారు. ఇస్తామన్న ఆరు గ్యారెంటీలలో కనీసం ఒక్కదాన్నైనా అమలు చేశారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. మతం పేరుతో కులం పేరుతో ఓట్లు అడిగి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని, గెలిచి ఇన్ని మోసాలు చేసిన కాంగ్రెస్, బిజెపి పార్టీలను మున్సిపల్ ఎన్నికలలో ఓడించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో వేములవాడ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ ఇంచార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు, బి ఆర్ ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!