పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకుందాం.
2026, ఫిబ్రవరి 12న, దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం.
తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం నిలోజ్ పల్లి గ్రామంలో ఈరోజుహమాలి కార్మికుల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె పోస్టర్ను విడుదల చేయడం జరిగింది.
బోయిన్పల్లి మండలంలో అనేక రంగాలుగా పనిచేస్తున్నటువంటిఉపాధి హామీ కూలీలు,హ మాలి కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, గ్రామపంచాయతీ కార్మికులు, బీడి మహిళా కార్మికులు, ఆశ వర్కర్లు, విద్యుత్ సంస్థ హెల్పర్లు, అంగన్వాడి, మధ్యాహ్న భోజన కార్మికులు, యువత పెద్ద ఎత్తున కేంద్ర బిజెపి అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టడానికి, కార్మికులను కట్టు బానిసలుగా చేసే, లేబర్ కోడ్ లు బిల్లు రద్దు చేయాలని, పోరాడి సాధించుకున్న 8,గంటల పని సమయాన్ని ఎత్తివేసి, 12, గంటలు కార్మికులు పనిచేయడాన్ని తీసుకువచ్చే బిల్లును, ఇలా అనేక రకాలుగా సంఘటిత, అసంఘటిత కార్మికులపై శ్రమను దోచుకునే విధంగా, వారి హక్కులను కాలు రాసే విధంగా, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, పని భద్రత లేకుండా, ప్రమాద బీమా సౌకర్య లేకుండా ఇలా అనేక రకాలుగా కేంద్ర బిజెపి ప్రభుత్వం పారిశ్రామిక యాజమాన్యాలకు తొత్తులుగా మారి, వారికి లాభాలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టడానికి ఈ నెల ఫిబ్రవరి, 12వ తేదీన గురువారం రోజున బోయిన్పల్లి మండల కేంద్రంలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి (సమ్మె), పెద్ద ఎత్తున ఉదయం 9 గంటల వరకు అంబేద్కర్ చౌరస్తా వద్దకు అన్ని రంగాల కార్మికులు, సామాన్య ప్రజానీకం, యువత నిరసనలో పాల్గొని కేంద్ర బిజెపి ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా మన నిరసన తెలియజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మిక సంఘాలుగా పిలుపునివ్వడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు సహాయ కార్యదర్శి గురజాల శ్రీధర్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచాఅశోక్, హ మలి సంఘం అధ్యక్షులు సింగిరెడ్డి శంకర్, అనుమల రవి, ఆవుల మల్లయ్య, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
