namstevemulawada.in
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 4:20 pm Digital Edition : NAMASTE VEMULAWADA

కేసీఆర్ పాలనలో,మున్సిపల్ హయాములోని అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి!పొలాస నరేందర్

అభివృద్ధికే పట్టం కట్టబోతున్న ఓటర్లు! బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమంటున్న పట్టణ ప్రజలు!

అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ వైపే!మున్సిపల్ పై గులాబి జెండ ఎగరడం ఖాయం

పొలాస నరేందర్ మాజీ సర్పంచ్
మాజీ ధర్మకర్త – బీఅర్ఎస్ పార్టీ వేములవాడ పట్టణం కెసిఅర్ ప్రభుత్వ పాలనలో , మున్సిపల్ హయాంలో అన్నిరంగాల్లో ఊహించిన దానికంటే ఎక్కువగా అభివృద్ధి చెందిందన్నది సత్యమని,వేములవాడ అన్ని రంగాల్లో జరిగిన అభివృద్ధి కండ్లకు స్పష్టంగా కనబడుచున్నధని,జరిగిన అభివృద్ధిని అన్ని వర్గాల వారు అంగీకరిస్తున్నారని మాజీ సర్పంచ్,మాజీ ధర్మకర్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొలాస నరేందర్ మాట్లాడుతూ అన్నారు.
కేసీఆర్ పాలనలో,మున్సిపల్ హయాంలో ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందిన వేములవాడ పట్టణం ఏ మాత్రం అభివృద్ధి జరుగలేదని ఎవరన్న అంటే అది అసత్యమగునని, అభివృద్ధిని మెచ్చుకోకున్నను విమర్చించడం భావ్యం కాదని పొలాస నరేందర్ అన్నారు.
పట్టణంలో 100 పడకల ఆసుపత్రి,ములవాగులో బ్రిడ్జీల నిర్మాణం,పార్కుల నిర్మాణం, తార్ రోడ్లు, సిమెంటు రోడ్లు,మురికి కాలువల నిర్మాణం,ఫైర్ స్టేషన్,గ్రంధాలయం,కూరగాయల మార్కెట్,గుడి చెరువు,దేవాలయం సుందరీకరణ,బద్ధిపోచమ్మ దేవాలయం,మున్సిపల్ భవనం,మల్లారం రోడ్డులో ,తెలంగాణ చౌక్లో జంక్షన్ల ఏర్పాటు,మూలవాగులో చెక్ డ్యామ్స్ నిర్మాణం,వైకుంఠ ధామం,హైస్కూల్ నిర్మాణం,డంప్ యార్డ్,మిడ్ మానేర్ నుండి గుడి చెరువులోకి పైప్ లైన్,మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ లాంటివి ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరిగినవి నిజం కాదా అని పొలాస నరేందర్ అన్నారు.
గత 10 ఏండ్ల నుండి కేసీఆర్ పాలనలో వేములవాడలో జరిగిన అభివృద్ధిని చూసి పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే జై కొడుతున్నారని,మున్సిపల్ పై బీఅర్ఎస్ పార్టీ జెండ ఎగరవేయడానికి ప్రజలు సంపూర్ణంగా,పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారని పొలాస నరేందర్ అన్నారు.