namstevemulawada.in
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 5:48 pm Digital Edition : NAMASTE VEMULAWADA

గత 6 సంవత్సరాల నుండి ప్రతి సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజావాణిలో దివ్యాంగుడి ఆవేదన*

*కలెక్టర్ మేడం- స్పెషల్ కేసు కింద ఉద్యోగం కల్పించకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటా అని ఆవేదన చేస్తున్నా వికలాంగుడు ఓదెల నరేష్*

ఏండ్లు గడుస్తున్న ఏ అధికారికి కూడా వికలాంగుడి పట్ల కనికరం చూపడం లేదు అని వందల వేల దరఖాస్తు వచ్చిన ఫలితం లేదు అని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ నికి మార్కండేయ నగర్ కాలనీ కి చెందిన ఒక నిరుపేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వికలాంగుడు ఓదెల నరేష్ గత పది సంవత్సరాల నుండి ఒక అద్దె ఇంట్లో తన కుటుంబాన్ని జీవనం కొనసాగిస్తున్నాడు ఇప్పుడు తన కుటుంబం రోడ్డు పాలు అయిందని కన్నీరు మున్నీరయ్యాడు వికలాంగుడు అని ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని దిక్కుతోచని స్థితిలో బతుకుతున్నాడని సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో తన ఆవేదన తన గోడువెళ్ల దీసుకున్నాడు అతడికి కలెక్టర్ గారు ఈ నెలలో ఉద్యోగం ఇవ్వకపోతే పురుగుల మందు తాగి కలెక్టర్ ఆఫీస్ లోనే ఆత్మహత్య చేసుకుంటారని కన్నీరు మున్నీరయ్యారు వికలాంగుడు ఓదెల నరేష్ డిగ్రీ ఐటిఐ వరకు చదువుకున్నాడు వికలాంగుడు ఓదెల నరేష్ ఎన్ని పోటీ పరీక్షలు రాసిన కానీ ఏనాడూ విజయం దక్కలేదని కన్నీరు మున్నీరయ్యాడు రాజన్న సిరిసిల్ల జిల్లా నూతనంగా కలెక్టర్ కార్యాలయం ఓపెనింగ్ అయిన తెల్లారి నుండి ఈరోజు వరకు లెక్కలేనని దరఖాస్తులు వేములవాడ రాజన్న దేవస్థానంలో కానీ ఎంప్లాయిమెంట్ ఆఫీస్ లో కానీ డీ డబ్ల్యూ ఆఫీస్ లో కానీ ఇన్ వర్డ్ అవుట్ వార్డ్ లో కానీ దరఖాస్తులు ఎన్ని ఉన్న తనను పట్టించుకున్న పాపాన పోలేదని తన ఆవేదన వ్యక్తం చేశాడు ఇప్పటికీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వికలాంగుల చెర్మన్ లెటర్ ఫ్యాడ్ లు ఇచ్చిన చెత్తకుండీలో లెటర్ లు పడి వేశారని తను కన్నీరు మున్నీరయ్యాడు
సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ప్లకార్డులతో నిరసన తెలుపుతూ తన గోడు వెళ్ళు తీసుకున్నాడు
పుట్టుకతోనే వికలాంగుడైన నరేష్ గత కొన్ని ఏళ్లు గా ఏదైనా జీవనం లేదా ఉద్యోగం కల్పించాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు గత ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్లకు వివిధ శాఖల అధికారులకు మంత్రులకు వందల దరఖాస్తులు ఇచ్చిన ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తన వికలాంగుడి దీన స్థితిని చూసి మానవత్వంతో ఆదుకుంటుందని ఆశతో పది సోమవారం సోమవారం ప్రజా వాణికి వస్తున్నట్లు తెలిపాడు ప్రజావాణికి వచ్చే అధికారులు కేవలం దరఖాస్తులు తీసుకోవడమే తప్ప తనకు శాశ్వత ఉపాధి చూపడం లేదు అని కన్నీరు మున్నీరయ్యాడు
నాకు జీవించడానికి వేరే మార్గం లేదు అధికారులు ఇప్పటికైనా స్పందించి ఉపాధి కల్పించాలి లేనిపక్షంలో కలెక్టర్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం కనిపించడం లేదు అని తెలిపారు వికలాంగుడు ఓదెల నరేష్ తన సమస్యలు స్పెషల్ కేసు కింద కేస్ కింద కలెక్టర్ అధికారులు తీసుకొని న్యాయం చేయాలని వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.