
తేదీ-7-4-2026 మంగళవారం మధ్యాహ్నం 2-00గంటలకు తెలంగాణ ఉద్యమ కళాకారుల ప్రధాన కార్యాలయం వేములవాడ నందు జరిగిన సమావేశంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరం TUF కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు అధ్యక్షతన జరుగు ఈ నెల 18వ తేదీన వేదిక మర్రికృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ తార్నాక హైదరాబాద్ నందు శనివారం ఉదయం 10-00 గంటల నుండి మధ్యాహ్నం 1-00 గంట వరకు రాష్ట్ర సదస్సు నిర్వహించబడును భోజన కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2-00 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెలంగాణ రాష్ట్రంలోని33 జిల్లాలోని ఉద్యమకారులు కళాకారులు కవులు సాహితీవేత్తలు గాయకులు రచయితలు మహిళ ఉద్యమ కళాకారులందరూ పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాను అలాగే ఉప్పెనై ఎగిసిపడే సముద్రపు కెరటముల ఉద్యమ వీరుడా కళాకారుల వీరవంతల్లారా రా కదిలి రా మన హక్కుల కొరకై నినాదించుటకు పిలుస్తుంది తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం 33 జిల్లాల అధ్యక్షులు కన్వీనర్లు రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు కోఆర్డినేటర్లు మండల అధ్యక్షులు గ్రామస్థాయి అధ్యక్షులు కన్వీనర్లు పూర్తి బాధ్యతలు తీసుకొని ఈనెల 18న దగా పడ్డ మన బ్రతుకుల కోసం దండు కట్టి కదలిరండి అని ఉద్యమ కారులు కళాకారులు రాష్ట్ర సదస్సులో పాల్గొనే విధంగా కృషి చేయగలరని కోరుచున్నాను ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ కళాకారుల విభాగం తెలంగాణ కోఆర్డినేటర్ బొడ్డు రాములు దక్షిణ తెలంగాణ కళాకారుల విభాగం కన్వీనర్ వెన్నమల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు