ePaper
Sunday, April 12, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణనాటక రంగ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి . రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి.

నాటక రంగ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి . రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి.

📰 Generate e-Paper Clip


వేములవాడ పట్టణంలోని పద్మశాలి సంఘం మార్కండేయ నగర్ యందు బుధవారం రాత్రి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి నాట్య కళామండలి గుండన్నపల్లె ,వేములవాడ కళాకారులచే శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్ర నాటకము ముగింపు నాటక ప్రదర్శన కార్యక్రమమునకు విచ్చేసిన తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం TUF కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి, మాజీ కౌన్సిలర్ గూడూరు మధు, ఉత్తర తెలంగాణ కళాకారుల విభాగం కోఆర్డినేటర్ బొడ్డు రాములు ,జిల్లా సాంస్కృతిక కళా సంస్థల అధ్యక్షులు సావనపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళాకారుల అధ్యక్షులు వారాల దేవయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ ,జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మడి రాజేశం గౌడ్ మరియు నాట్య కళామండలి నిర్వాహకులందరూ కలసి జ్యోతి వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ముగింపు నాటక ప్రదర్శనను ప్రారంభించారు .అనంతరం రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నాటక కళామండలి వారి ప్రదర్శన కార్యక్రమము క్రమం తప్పకుండా నిర్వహించడం చాలా సంతోషం. నాటకరంగ కళాకారులను తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆదుకొని కళాకారులకు జీవనోపాధి కల్పించాలి. ప్రాచీన కళలు కనుమరుగు కాకుండా చూడాలని కోరుచున్నాము. ముఖ్యపాత్రదారులు పుప్పాల దేవయాచార్యులు నారదుడు, వేములవాడ దుర్గయ్య చారి ఆత్రియముని ,చందనం జగన్ చారి బ్రహ్మ ,పుప్పాల శ్రీనివాసచారి విష్ణు సనుగుల నాగభూషణం ఆనంద భైరవుడు, శానకొండ మల్లేశం చారి భూదేవి ,వేములవాడ శంకరయ్య చారి లక్ష్మీదేవి, మర్రిపల్లి శ్రీనివాసాచారి శంకరుడు ,నేరెళ్ల రవి అచ్చమాంబ వారితోపాటు 20 మంది కళాకారులు గత రెండు రోజుల నుండి తమ అద్భుత నటనలతో కళలకు జీవం పోసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు అన్నారు నాటక రంగ కళాకారులకు, తిలకించిన ప్రేక్షక మహానుభావులందరికీ రాష్ట్ర కమిటీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!