namstevemulawada.in
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 6:07 am Digital Edition : NAMASTE VEMULAWADA

*నిఘా నీడలో మహాజాతర – 175 సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన పర్యవేక్షణ.*

*మహాశివరాత్రి జాతర సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆలయ ప్రాంగణంతో పాటు పట్టణ కేంద్రంలోని కీలక ప్రాంతాల్లో మొత్తం 175 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.ఈ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి జాతర ప్రాంగణం, ట్రాఫిక్ రద్దీ, క్యూలైన్లు, పార్కింగ్ ప్రదేశాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తిన వెంటనే కమాండ్ కంట్రోల్ నుండి వైర్లెస్ సెట్ ద్వారా సంబంధిత సిబ్బందికి సమాచారాన్ని చేరవేస్తున్నారు.*

*భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారి దర్శనం చేసుకునేలా, అలాగే అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.*