namstevemulawada.in
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 4:27 pm Digital Edition : NAMASTE VEMULAWADA

*బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డాక్టర్ చెన్నమనేని దీప*

వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 19వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి రేగుల రాధిక -సంతోష్ బాబు దంపతులకు మద్దతుగా పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు సతీమణి డాక్టర్ దీప ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డు బీజేపీ అభ్యర్థి రేగుల రాధిక సంతోష్ బాబు తరఫున ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజలను కలుసుకుని బీజేపీకి ఓటు వేయాలని కోరారు.ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపట్టిన పలు పథకాలు సామాన్య ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను తెలియజేశారు.గతంలో సంతోష్ బాబు 20వ వార్డులో కౌన్సిలర్ గా చేసిన పలు అభివృద్ధి,సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు.ప్రజలు ఆశీర్వదించి ఈ ఎన్నికల్లో 19వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేగుల రాధిక-సంతోష్ బాబు లను కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.వార్డు సమగ్ర అభివృద్ధికి రేగుల రాధిక సంతోష్ బాబు ఎల్లవేళలా కృషి చేస్తారని,వారికి తమ ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటాయని తెలియజేశారు.వార్డు ప్రజలందరూ ఆలోచించి రాధిక సంతోష్ బాబు లను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు,పార్టీ కార్యకర్తలు,స్థానిక వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.