namstevemulawada.in
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 6:49 pm Digital Edition : NAMASTE VEMULAWADA

*బీమన్న ఆలయ ఆదాయానికి గండి*

*లడ్డుల కేంద్రం వద్ద ప్రవేట్ వ్యక్తులు ఇష్టరాజ్యంగా క్యారీబ్యాగ్స్ విక్రయాలు*

*పట్టించుకోని ఆలయ అధికారులు SPF సిబ్బంది &హోంగార్డ్ సిబ్బాoది*

*దేవస్థానం వాళ్లు ముద్రించి శాశ్వత పూజల వివరాలు కొట్టించి భక్తులకు దేవస్థానం సిబ్బంది వాళ్లు అమ్మాలి*

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధాలయమైన భీమేశ్వర ఆలయం ముందు ఉన్న లడ్డు కౌంటర్ వద్ద దర్జాగా మహిళలు ఇద్దరు అబ్బాయి లు షాపింగ్ మాల్ లో పని చేసుకుంటు కలి సమయంలో భక్తుల వద్ద దండు కుంటున్నారు అలాగే బిక్షాటన చేసేవాళ్లు దాదాపు పది మందికి పైగా క్యారీ బ్యాగులు సొమ్ము చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది ఆలయానికి వచ్చే వేలది మంది భక్తులు ప్రసాదాలు తీసుకొని వెళుతున్న సందర్భంలో క్యారీ బ్యాగులు ప్రైవేట్ వ్యక్తులు ఇష్టాను రీతిగా ఎవరికి భయపడేది లేదు అని అమ్ముతున్నారు ఆలయ అధికారులు సంబంధిత ఈవో ఏఈఓలు మరియు ఎస్పీఎఫ్ హోంగార్డ్ సిబ్బంది పట్టించుకోకుండా చేతులు దులిపేసుకుంటున్నారు మమ్మల్ని హోంగార్డ్స్ ఎస్పీఎఫ్ సిబ్బంది అమ్ముకోమన్నారు అని చెప్తున్నారు మహిళలు వాళ్లకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మహిళలు అమ్ముకుంటున్నారు అని విమర్శలు వస్తున్నాయి భక్తుల వద్ద చాలా నిలువు దోపిడీ చేస్తున్నరు ఆలయ అధికారులు ఎస్పీఎఫ్ హోంగార్ సిబ్బంది నిర్లక్ష్యం వాళ్లనే ఇలా జరుగుతుంది అని భక్తులు చెబుతున్నారు ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని దేవస్థానం వాళ్లే ఫోటో ముద్రించి యాదగిరిగుట్ట లెక్క దేవస్థానం ఒక కౌంటర్ ఏర్పాటు చేసి మనిషిని కూర్చోబెట్టి అవసరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు