ePaper
Wednesday, February 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణ*భక్తులకు సులభంగా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు*

*భక్తులకు సులభంగా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు*

📰 Generate e-Paper Clip

*ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్*

*మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్, ఎస్పీ మహేష్ బి గితే*

మహా శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలో శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు సులభంగా దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను బుధవారం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే, వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి ఐపీఎస్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేస్తున్న క్యూలైన్లు, భక్తుల ఎంట్రీ ఎగ్జిట్ మార్గాలు, పార్కింగ్ సదుపాయాలు తదితర అంశాలను వారు పరిశీలించి, జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు.
వీఐపీ దర్శనాల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు.
పరిశీలనలో ఆలయ ఈవో ఎల్. రమాదేవి, వేములవాడ ఆర్డీవో  రాధాబాయి, ఈఈ రాజేష్, ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహాచారి, డీఈ శాంతయ్య, తహసీల్దార్ జయంత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, టీపీఓ అన్సార్, ఆలయ ఉద్యోగులు, అర్చకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!