namstevemulawada.in
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 3:54 pm Digital Edition : NAMASTE VEMULAWADA

*మహా శివరాత్రి జాతర సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.*

ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో నిర్వహించనున్న మహా శివరాత్రి జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ తరువున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భీమేశ్వరస్వామి ఆలయంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఎంట్రీ–ఎగ్జిట్ మార్గాలు, క్యూలైన్లు మరియు ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జనరల్, వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ ప్రదేశాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రశాంత వాతావరణంలో దర్శనం జరిగేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.పట్టణంలోని ప్రధాన మార్గాల్లో రూట్ మ్యాప్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భక్తులకు సులభంగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో రహదారులు,పార్కింగ్ సదుపాయాలు,క్యూలైన్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఎస్పీ వెంట వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్‌.ఐ రాజు, ఆలయ ఈఈ రాజేష్, డీఈ మైపాల్ రెడ్డి, ఏఈ రామకృష్ణారావు, ఆలయ ఇన్‌స్పెక్టర్ ఎడ్ల శివసాయి తదితర అధికారులు పాల్గొన్నారు.