namstevemulawada.in
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 2:34 pm Digital Edition : NAMASTE VEMULAWADA

*మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు 250 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు.*

*ఓట్ల లెక్కింపు సందర్భంగా 163 BNSS (144  సెక్షన్ అమలు),విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధo*

*నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.*

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా సిరిసిల్ల, వేములవాడలలో ఏర్పాటు చేసిన కౌటింగ్ కేంద్రాల వద్ద 250 మంది పోలీస్ లతో  పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత నిర్వహిస్తున్నామని,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా163 BNSS (144  సెక్షన్ అమలు) అమలు చేస్తున్నామన్నారు.ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులో ఉందని  ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం,గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు *విజయోత్సవ ర్యాలీలు,సభలు,బైక్ ర్యాలీలు నిర్వహించడం, డీజే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, టపాకాయలు కాల్చడం, భారీగా గుంపులు, గుంపులుగా గుమి కూడటం, ఫంక్షన్ హాల్స్‌లో సమావేశాలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధం అన్నారు.* ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఆంక్షలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని,ఎన్నికల నియమాలను అతిక్రమిస్తే చట్టపరమైన తీసుకుంటాని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.