రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా పౌర సంబంధాల అధికారి ఏడుకొండలు గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతనంగా డీ.పి.ఆర్.ఓ పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో కళాకారుల విభాగం రాష్ట్ర కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామి చిత్రపటం స్వామి వారి లడ్డు ప్రసాదం మరియు కండువాతో పాటు అలాగే యెల్ల పోశెట్టి జన్మదిన అభినందన సంచికను అందజేయడమైనది ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ ఫోరంTUF కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి గాయకులు మరియు ఉత్తర తెలంగాణ విభాగం కోఆర్డినేటర్ బొడ్డు రాములు రంగస్థల కళాకారులు , కళాకారుల విభాగం జిల్లా అధ్యక్షులు వారాల దేవయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ డప్పునృత్య కళా కారులు జిల్లాఉద్యమ కళాకారుల ఫోరం ఉపాధ్యక్షులు బొడ్డు నారాయణ… తదితర కళాకారులు పాల్గొన్నారు