ePaper
Sunday, April 12, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణవృద్ధ కళాకారులకు వృధ్యప్య పింఛడ్లను అందజేయాలి

వృద్ధ కళాకారులకు వృధ్యప్య పింఛడ్లను అందజేయాలి

📰 Generate e-Paper Clip


— రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి

కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంనందు శుక్రవారం రాత్రి శ్రీరామాంజనేయ కళాబృందం కళాకారులచే చిరుతల రామాయణం ముగింపు నాటక కళా ప్రదర్శనమునకు ముఖ్య అతిథులు పోరండ్లగ్రామ సర్పంచ్
అసోద శ్రీనివాస్, ఉపసర్పంచ్ నీలం ఓదెలు గౌరవ అతిథులుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం టి .యు.ఎఫ్ (TUF) కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి, ఉత్తర తెలంగాణ జిల్లా అధ్యక్షులు భొల్లా కొమురయ్య, తెలంగాణ రాష్ట్ర కళాకారుల వేదిక అధ్యక్షులు కో-ఆర్డినేటర్ బొద్దు రాములు, తెలంగాణ ఉద్యమ కళాకారుల ఫోరం రాష్ట్ర నాయకులూ బొజ్జ కనుకయ్య, ప్రముఖ సీనియర్ జానపద గాయకులూ తెల్లం మురళీమాధు, రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల విభాగం అధ్యక్షులు వారల దేవయ్య, గ్రామ పంచాయితీ పాలక మండలి వార్డు సభ్యులు, శ్రీరామాంజనేయ కళా బృందం కళాకారులు, గ్రామపెద్దలు అందరూ కలిసి జ్యోతి వెలిగించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం గ్రామా సర్పంచ్ అసోద శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా మాగ్రామ కళాకారులు చిరుతల రామాయణం నాటక కళాప్రదర్శనలు ఇవ్వడం చాల సంతోషంగా ఉందని అన్నారు. కళాకారులని వార్దు సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి మాట్లాడుతూ ఈ రోజున ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలను కళాకారులందరికి తెలియజేస్తూ, వృద్ధకళాకారులకు ప్రభుత్వం వెంటనే కొత్తగా వృద్ధ్యాప్య పించడ్లను మంజూరు చేసి కళాకారులని ఆదుకోవాలని అన్నారు. శ్రీరామాంజనేయ కళాబృందం అధ్యక్షులు మరియు సభ్యులు బొజ్జ ఎల్లయ్య, బొజ్జ కొమురయ్య, బొజ్జ పర్శరాములు, నీలం భాస్కర్, సాదిరే రవి, బొజ్జ రాజయ్య, బొజ్జ అయిలయ్య, కూన కనుకయ్య వీరితో పాటు 25 మంది కళాకారులు గత రెండు రోజులనుండి వారి వారి నటనలతో కాలాలకు జీవం పోస్తూ నటిస్తున్నారని అన్నారు. కరీంనగర్ జిల్లా ఉద్యమ కళాకారుల విభాగం అధ్యక్షులు బొజ్జ ఎల్లయ్య మాట్లాడుతూ ముగింపు కార్యక్రమాలకు విచ్చేసిన రాష్ట్ర నాయకులకు అలాగే గ్రామా ప్రజలందరికీ మా కళా బృందం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అన్నారు.

పేరు – పాత్ర
K. కనుకయ్య – పంతులు
N. భాస్కర్ – దశరథుడు
K. కొంరయ్య – రాముడు
S. రమేష్ – లక్ష్మణుడు
P. అజయ్ – భరతుడు
P. రాము – శత్రజ్ఞుడు
S. రవి – రావణాసురుడు
D. సతీష్ – విశ్వామిత్రుడు
N. మహేష్ – మారీచ
S. నాగరాజు – శుభాబు
N. శంకర్(మన్నేంపల్లి ) – తాటకి
P. శ్రీపతి – వశిష్ఠుడు
N. నికిల్ – అహల్య
K. సంపత్ – జనకుడు
సంపత్ (ఖాదరగూడెం) – పంతులు
శ్రీను – మందర
అనిల్ – కైక
P. అనిల్ – శూర్పణ
N. కుమార్ – సీత
P. రాము – మాయలేడి
P. శ్రీను – జటాయువు
N. మహేష్ – సుగ్రీవుడు
సంపత్ (ముంజంపల్లి) – ఆంజనేయుడు
శంకర్ (రామకృష్ణ కాలనీ) – వాలి
శ్రీపతి – అంగదుడు
శ్రీను – తార
S. నాగరాజు – సురస
P. అంజయ్య – లంకిణి
B. అక్షిత – దేవగణం
P. అజయ్ – మండోదరి
రాజిరెడ్డి (ముంజంపల్లి) – అక్షయుడు
P. నర్సయ్య – ఇంద్రజిత్తు
D. కొమురయ్య – విభీషణుడు
N. రవి – సముద్రుడు
వివేక్, యశ్వంత్, సాయి , అక్షిత, అనీష్ – రాక్షసులు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!