వార్డును అభివృద్ధి పథంలో ముందు ఉంచుతా
ఇంటింటికీ వెళ్లి కుంకుమ తిలకం దిద్ది. ఆశీస్సులు కోరిన అర్చన 11 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సరిపెల్లి అర్చన
వేములవాడ పట్టణ మున్సిపల్ ఎన్నికల వేళ 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిపెల్లి అర్చన వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించారు. భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా వార్డులోని మహిళా ఓటర్లకు కుంకుమ దిద్ది, వారికి నమస్కరిస్తూ మద్దతు కోరడం స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది. ప్రతి ఇంటి గడప తొక్కిన అర్చన అక్కా చెల్లెళ్లను ఆత్మీయంగా పలకరిస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసు కున్నారు. తాను గెలిచిన వెంటనే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని, ముఖ్యంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తానని ఆమె హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, అభివృద్ధికి చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థి అర్చన కు వార్డు మహిళల నుంచి బ్రహ్మరథం పట్టి, హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు వార్డు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

