namstevemulawada.in
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 12:35 pm Digital Edition : NAMASTE VEMULAWADA

వేములవాడ: మున్సిపల్ సిబ్బందితో పూల వ్యాపారి వాగ్వాదం

వేములవాడలోని అంబేడ్కర్ చౌరస్తాలో మంగళవారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డుపై తోపుడు బండిపై పూలు విక్రయిస్తున్న ఓ వ్యాపారి, అక్కడ పారిశుద్ధ్య పనులు చేస్తున్న మహిళా కార్మికురాలితో గొడవకు దిగారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ సిబ్బంది జోక్యం చేసుకొని వారించగా, వారితోనూ వ్యాపారి వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది సదరు తోపుడు బండిని మున్సిపల్ వాహనంలో అక్కడి నుంచి తరలించారు.