ePaper
Wednesday, February 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణవేములవాడ మున్సిపాలిటీలో ముగిసిన పోలింగ్: 77.80 శాతం నమోదు*

వేములవాడ మున్సిపాలిటీలో ముగిసిన పోలింగ్: 77.80 శాతం నమోదు*

📰 Generate e-Paper Clip

*అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం*

*వేములవాడ మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు అందిన గణాంకాల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 77.80 శాతం పోలింగ్ నమోదైంది*. *ఈ ఎన్నికల్లో మొత్తం 31,803 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, వారిలో 14,742 మంది పురుషులు, 17,055 మంది మహిళలు, మరియు ఆరుగురు ఇతరులు ఉన్నారు*. *పురుషుల కంటే మహిళా ఓటర్లే అత్యధిక సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయడం విశేషం. ఉదయం నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడంతో ఎన్నికల సందడి నెలకొంది. అధికారుల పర్యవేక్షణలో ప్రశాంతంగా ముగిసిన ఈ ఎన్నికల ద్వారా అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది*.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!