namstevemulawada.in
Newspaper Banner
Date of Publish : 06 February 2026, 11:14 am Digital Edition : NAMASTE VEMULAWADA

*వేములవాడ మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం*

*వేములవాడ పట్టణంలోని పలు వార్డుల్లో గడప గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ విప్*

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ మున్సిపల్ పరిధిలోని 04 వార్డు తోట రాజు,16 వార్డు కూరగాయలు శ్రీశైలం,18 వార్డు కొండా రాజా శేఖర్,19 వార్డు నూగురీ లక్ష్మీ లకు మద్దతుగా గడప గడపకు ఎన్నికల ప్రచారన్నీ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన గడప గడపకు తిరుగుతూ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని, వేములవాడ మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు…