namstevemulawada.in
Newspaper Banner
Date of Publish : 07 February 2026, 11:12 am Digital Edition : NAMASTE VEMULAWADA

శ్రీధర్‌ గెలుపే లక్ష్యం.. 24వ వార్డులో వికాస్‌రావు ప్రచారం

-మహిళల సంక్షేమం మోదీతోనే సాధ్యం

-పట్టుదల కలిగిన వ్యక్తిని గెలిపించండి: డాక్టర్‌ వికాస్‌
మున్సిపల్ ఎన్నికల పోరులో 24వ వార్డు రాజకీయం ఆసక్తికరంగా మారింది. బిజెపి అభ్యర్థిగా బరిలో ఉన్న రాపల్లి శ్రీధర్ విజయమే లక్ష్యంగా శనివారం బిజెపి వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జ్ డాక్టర్ చిన్నమనేని వికాస్ వార్డులోని ప్రతి గల్లీలో పర్యటిస్తూ ఓటర్లను ఆత్మీయంగా పలకరించారు.ప్రచారంలో భాగంగా వికాస్‌రావు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మహిళల గౌరవం కోసం ‘ఆపరేషన్ సింధూర్’ వంటి కార్యక్రమాలతో అండగా నిలిచారని గుర్తు చేశారు. అదే విధంగా 24వ వార్డు మహిళలందరూ ‘ఆపరేషన్ శ్రీధర్’ చేపట్టి, రాపల్లి శ్రీధర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. శ్రీధర్ మొండి పట్టుదల గలవాడని, ఏదైనా పని కావాలంటే పట్టుబట్టి సాధించే కార్యశీలి అని కొనియాడారు.శ్రీధర్‌కు ఒక్క అవకాశం కల్పిస్తే వార్డు ప్రజలకు మెరుగైన మినరల్ వాటర్ సేవలు అందిస్తారని, మీలో ఒక్కడిగా ఉండి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దే సత్తా ఆయనకు ఉందని, గతంలోఆయన చేసిన సేవలు అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.