*కొండ నర్సయ్యకు మద్దతుగా కొండ దేవయ్య, తీగల రవీందర్ గౌడ్, పొలాస నరేందర్లు ఇంటింట విస్తృత ప్రచారం*
*మరోసారి మున్సిపల్ పై బీ ఆర్ ఎస్ జెండ ఎగరడం ఖాయం: కొండ దేవయ్య, తీగల రవీందర్ గౌడ్, పొలాస నరేందర్లు*
బీ ఆర్ ఎస్ పార్టీ 18 వ వార్డు అభ్యర్థి కొండ నర్సయ్య కు మద్దతుగా ఈ రోజు ఉదయం నేతలు కొండ దేవయ్య పటేల్,తీగల రవీందర్ గౌడ్, పొలాస నరేందర్ లు ఇంటింట ప్రచారం చేస్తూ,గతంలో బీ ఆర్ ఎస్ పాలనలో వేములవాడ పట్టణంలో జరిగిన అభివృద్ధిని,వార్డు కౌన్సిలర్ కొండ పావని 5 ఏండ్ల పాలనలో వార్డులో జరిగిన అభివృద్ధిని చూసి మరో మారు కారు గుర్తుకు ఓటు వేసి కొండ నర్సయ్యను గెలిపించాలని ఓటర్లను కోరారు.
18 వ వార్డుతో పాటుగా వేములవాడ పట్టణం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి జరగాలంటే ,మున్సిపల్ పై మరో మారు గులాబి జెండ ఎగరడం కోసం 18 వ వార్డులో బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కొండ నర్సయ్య ను గెలిపించాలని నేతలు కొండ దేవయ్య, తీగల రవీందర్ గౌడ్, పొలాస నరేందర్లు ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయమని అభ్యర్థించారు. బీ అర్ ఎస్ పార్టీ 18 వ వార్డు అభ్యర్థి కొండ నర్సయ్య వార్డులో సిమెంటు రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం వంటి తదితర ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందనీ,మరో సారి అవకా
శం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని, కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ప్రచారంలో గజ్జెల రమేష్, దండు రాజమల్లయ్యా, సాయికుమార్,బండారి గవాస్కర్, తాల్లపెల్లి రాములు, ఎండీ.రహిమత్,పుదరి శివకుమార్, తుపుకారి సతీష్, వంశీ కృష్ణ, చింతపంటి లింగమూర్తి, కొడుముంజ సాయి, మైనార్టీ నాయకులు,కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
