ePaper
Sunday, April 12, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణఉద్యమ కారుల హామీలు అమలుకు సబ్ కమిటీ ఏర్పాటు !హర్షనీయం

ఉద్యమ కారుల హామీలు అమలుకు సబ్ కమిటీ ఏర్పాటు !హర్షనీయం

📰 Generate e-Paper Clip

రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి

 తెలంగాణ ఉద్యమ కారుల విభాగం ప్రధాన కార్యాలయం వేములవాడ నందు జరిగిన సమావేశంలో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం TUF కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్ల పోశెట్టి మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్ర oఏర్పడే వరకు కంకణ బద్ధులై పని చేసిన తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని నిజామాబాదులో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు మంత్రివర్యులు శ్రీ జి.వివేక వెంకటస్వామి డి శ్రీధర్ బాబు మన ముఖ్యమంత్రివర్యులు A.రేవంత్ రెడ్డి గారిని కలిసి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మన ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగినది.దీనికి సానుకూలంగా స్పందించారని ఈ నెలలోనే ఉద్యమ కారులను గుర్తించడానికి సబ్ కమిటీ వేస్తారని ప్రకటన చేయడం హర్షనీయమని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వనికి ఉద్యమకారుల,కళాకారుల పక్షాన ధన్యవాదములు కృతజ్ఞతలు. తెలియజేస్తూఉద్యమ సమయంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా కృషి అలాగే కవులు,కళాకారుల కృషి అభినందనీయమని అన్నారు.గత తొమ్మిది సంవత్సరాల క్రితం డాక్టర్ చీమ శ్రీనివాసరావు నేతృత్వంలో ఉద్యమకారుల,కళాకారుల ఫోరంను ఏర్పాటు చేసి ఉద్యమకారులకు కళాకారులకు ఏకం చేసిన ఘనత డాక్టర్ చీమ శ్రీనివాసరావు కే దక్కిందని అన్నారు. ఉద్యమకారుల అంశాన్ని ఆరు గ్యారెంటీలలో పొందుపరిచే విధంగా ఉద్యమకారులు ఉద్యమ కారుల ఫోరం, ఉద్యమకారుల పోరాటాలు త్యాగాలు కళాకారుల ఆటపాటల ధూంధాం కార్యక్రమాలు మరువలేనివని చరిత్రలో ఎప్పుడు లిఖించబడి ఉంటాయని అన్నారు.
తేదీ మార్చి – 01- 2026ఆదివారం రోజున చలో కరీంనగర్ కు ఉద్యమకారులు కళాకారులు అందరు విచ్చేయవలసిందిగా కోరుచున్నాము.
ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ కళాకారుల విభాగం కోఆర్డినేటర్ బొడ్డు రాములు వెన్నమల్ల వెంకటేష్ ఉద్యమకారుల అధ్యక్షులు బొజ్జ కనకయ్య నేరెళ్ల తిరుమల్ గౌడ్ కళా సంస్థల అధ్యక్షులు సవనపల్లి శ్రీనివాస్ ఉద్యమ కళాకారుల జిల్లా అధ్యక్షులు వరాల దేవయ్య నృత్య కళానికేతన్ అధ్యక్షులు కనపర్తి హన్మాండ్లు గంగా శ్రీకాంత్ మానువాడ లక్ష్మీనారాయణ తదితర కళాకారులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!