ePaper
Sunday, April 12, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణ*వార్డు అభివృద్ధికి కృషి చేస్తా: కౌన్సిలర్ ఏనుగు జ్యోతి-తిరుపతి రెడ్డి*

*వార్డు అభివృద్ధికి కృషి చేస్తా: కౌన్సిలర్ ఏనుగు జ్యోతి-తిరుపతి రెడ్డి*

📰 Generate e-Paper Clip

*​నూతన కౌన్సిలర్ ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి కి రజాకా సంఘం మరియు గౌడ సంఘం ఘన సన్మానం*

శాత్రాజుపల్లి 2 వ వార్డ్ సమస్యల పరిష్కారమే లక్ష్యం

వేములవాడ మున్సిపాలిటీలో నూతనంగా విలీనమైన శాత్రాజుపల్లి గ్రామం 2వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి ని గౌడ సంఘం మరియు రజాకా సంగం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మరియు రజాకా సంఘం అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు శాలువాతో కప్పి, పూలమాలలతో అభినందించారు. ​ఈ సందర్భంగా ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపించిన వార్డు ప్రజలకు, అండగా నిలిచిన సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విలీన గ్రామమైన శాత్రాజుపల్లిలో 2వ వార్డ్ లో మౌలిక వసతుల కల్పనకు, డ్రైనేజీ, సిసి రోడ్లు మరియు మంచినీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, వార్డు ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!