*ఒగ్గు రాజేశం గెలుపు.. రాజీవ్ నగర్ అభివృద్ధికి మలుపు..బహిరంగ సభలో కేటీఆర్ పిలుపు!..*
*11వ వార్డులో ‘దేఖ్ లేంగే’ అంటూ మహిళా లోకం చిందులు!.*
మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా 11వ వార్డులో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.అభ్యర్థి ఒగ్గు రాజేశం విజయాన్ని కాంక్షిస్తూ సాగిన ఈ ప్రచారంలో మహిళా సైన్యం చూపిన ఉత్సాహం వార్డును హోరెత్తించింది.
*హోరెత్తిన ‘దేఖ్ లేంగే’ పాట.. ఆకట్టుకున్న నృత్యాలు!*
కేటీఆర్ వార్డులోకి ప్రవేశించగానే మహిళలు, యువత ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ‘దేఖ్ లేంగే’ సాంగ్ రీమిక్స్‌కు మహిళా సైన్యం వేసిన స్టెప్పులు ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమ ప్రియతమ నాయకుడిని చూడగానే మహిళలు డప్పు దరువులకు అనుగుణంగా నృత్యం చేస్తూ, పూల వర్షం కురిపించారు. రాజేశం గెలుపు ఖాయమంటూ మహిళా లోకం ఏకతాటిపై నిలిచి సంబరాలు జరుపుకోవడం గమనార్హం.
*ప్రజల మనిషి.. మన రాజేశం!*
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ, అభివృద్ధికి పాటుపడే ఒగ్గు రాజేశం లాంటి నాయకుడిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాజేశం అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చి చూపిస్తున్న ఈ అభిమానం, గెలుపు దిశగా పడుతున్న తొలి అడుగు అని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు.

