
రోజువారి వేతనం 400 రూపాయలు చెల్లించాలి.
సిపిఎం పార్టీ డిమాండ్.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం బూరుగుపల్లి గ్రామ ఉపాధి హామీ కూలీలను సిపిఎం పార్టీ పక్షాన కలిసి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. గత రెండు నెలల నుంచి ఈ బోయిన్పల్లి మండలంలో గ్రామాల ఉపాధి హామీ కూలీలకు వారు చేసిన పనికి సకాలంలో డబ్బులు వారి ఖాతాలో జమ చేయకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా ఉపాధి హామీ కూలీలు గోడు వెళ్లి బు చ్చుకోవడంజరిగింది. ఉపాధి హామీ కూలీల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం లేకపోవడం వల్ల ఉపాధి హామీ కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే పని ప్రదేశంలో కూడా భద్రతపరంగా తాగునీటి సమస్య, టెంట్ సౌకర్యం, మెడికల్ కిట్టు సౌకర్యం లేకపోవడం వల్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో డబ్బులు చెల్లించి వారి సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ పక్షాన పత్రిక ముఖంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్ మండల సిపిఎం పార్టీ నాయకులు కుడుకల గిరిబాబు, మరియు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
