ePaper
Wednesday, June 17, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణవార్డు అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకే ఓటు వేయండి: గూడూరి మధు పిలుపు*

వార్డు అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకే ఓటు వేయండి: గూడూరి మధు పిలుపు*

📰 Generate e-Paper Clip

25వ వార్డు ప్రచారంలో దూసుకుపోతున్న బిఆర్ఎస్ అభ్యర్థి గూడూరి మధు*

*అందుబాటులో ఉండి అభివృద్ధి చేసే నేతకే మా మద్దతు.. గూడూరి మధు ప్రచారానికి విశేష స్పందన*

వేములవాడ పట్టణంలోని 25వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గూడూరి మధు తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గురువారం వార్డులోని పలు వీధుల్లో కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా గూడూరి మధు మాట్లాడుతూ గతంలో తన కుటుంబం నుంచి తన తల్లి, తన సతీమణి కౌన్సిలర్లుగా పనిచేసి వార్డు ప్రజలకు విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. ఆ సేవా దృక్పథంతోనే తాను ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నానని, తమ కుటుంబానికి వార్డు ప్రజలతో విడదీయలేని అనుబంధం ఉందని పేర్కొన్నారు.

గతంలో తన హయాంలో వార్డులో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని, వీధి దీపాల సమస్య తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా, సమస్య ఎదురైనా నిత్యం అందుబాటులో ఉంటూ పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. వార్డు మరింత అభివృద్ధి చెందాలన్నా, సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే వ్యక్తి కావాలన్నా కారు గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!