ePaper
Wednesday, February 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణ**వేములవాడ 11వ వార్డులో బిజెపి ఎన్నికల కార్యాలయం ప్రారంభించిన ప్రతాప రామకృష్ణ*

**వేములవాడ 11వ వార్డులో బిజెపి ఎన్నికల కార్యాలయం ప్రారంభించిన ప్రతాప రామకృష్ణ*

📰 Generate e-Paper Clip

వేములవాడ పట్టణంలోని 11వ వార్డులో భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని గురువారం 11వ వార్డు బిజెపి అభ్యర్థి ద్వారక శ్రీదేవితో కలిసి బిజెపి రాష్ట్ర నాయకులు ప్రతాపరామకృష్ణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ నాయకులు మాట్లాడుతూ, వేములవాడ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు.

అభ్యర్థి ద్వారక శ్రీదేవి మాట్లాడుతూ, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 11వ వార్డును అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రజల మద్దతు అవసరమని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో .పల్లె శ్యామ్ సుందర్ Ex ఆర్మీ,కటకం ప్రశాంత్
,తోట అజయ్ ,చందు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా నినాదాలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!