ఈరోజు పద్మావతి నర్సింగ్ హోమ్ తల్లి పిల్లల హాస్పిటల్ కు చాలా స్పెషల్ డే.. మన తల్లి పిల్లల హాస్పిటల్ నుంచి ఒక తల్లి, బిడ్డనీ క్షేమంగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. విషయంలోకి వస్తే.. హుస్సేన్ నగర్ గ్రామం, సిరికొండ మండలం, నిజామాబాద్ జిల్లాకు చెందిన అప్సానా W/O ఇమ్రాన్ లకు 12 సంవత్సరాల క్రితం పెళ్లి అయినది. అప్సానా 4 బేబీస్ కి జన్మనిస్తే ముగ్గురు బేబీలు రెండు లేదా మూడు రోజుల్లో చనిపోవడం జరిగినది. మిగితా 1 బాలుడు spastic cerebral అనే వ్యాధి తో ఉన్నాడు. ఇంతకు ముందు ట్రీట్మెంట్ మొత్తం హైదరాబాద్ లో పేరున్న కార్పొరేట్ హాస్పిటల్ లోనే జరిగినవి. అయినా వాళ్లకు విషాదమే మిగిలినది.
ఇక చివరిసరిగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పుడు భయంతో ఉన్న అప్సానాకి మన పద్మావతి నర్సింగ్ హోమ్ తల్లి పిల్లల హాస్పిటల్ గురించి తెలిసినది అప్పటినుంచి డాక్టర్ తేజేశ్వరి MBBS, DNB, OBGY స్త్రీ ప్రత్యేక వైద్య నిపుణులు చేత వైద్యం తీసుకోవడం జరిగినది. ప్రతిసారి వారు సిరికొండ నుంచి రావడం జరిగినది. ఈమెకు వైద్యం అందించడంలో చాలా చాలెంజింగ్ గా డాక్టర్ గారు తీసుకోవడం జరిగింది. జనవరి 27 తారీఖున ఆమెకి సిజేరియన్ చేసి డెలివరీ చేయడం జరిగినది. బేబీ బాయ్ ఒక కిలో 800 గ్రాములు పుట్టడం జరిగినది. బేబీ పుట్టిన తర్వాత బేబీ కి ఎన్నో ఇబ్బందులు వచ్చినా (రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్/PPHN/సెప్సిస్/నెక్రోటైజింగ్ ఎంటరోకాలైటిస్/జాండిస్) లతో ఉన్న నవజాతి శిశువుకు ‘డాక్టర్ శివకుమార్ MBBS, DNB, PEDIATRICS” (నవజాతి శిశువులకు ప్రత్యేక వైద్య నిపుణులు) గారు ప్రత్యేకమైన వైద్యం అందించి ట్రీట్మెంట్ చేయడం జరిగినది. ట్రీట్మెంట్ లో భాగంగా బేబీ ని 4 రోజులు cpap మీద ఉంచి ట్రీట్మెంట్ చేసి వారం తర్వాత ఈ రోజు తల్లి మరియు బేబీ బాయ్ ని డిశ్చార్జ్ చేయడం జరిగినది.
మన పద్మావతి నర్సింగ్ హోమ్ తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్స్ Drతేజేశ్వరి,
Drశివకుమార్ గార్లకు మరియు హాస్పిటల్ సిబ్బంది లకు అప్సానా, ఇమ్రాన్ దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగినది. చాలా ఆనందంతో వారు ఇంటికి వెళ్లడం జరిగినది
