ePaper
Wednesday, February 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణవార్డు అభివృద్ధికి కమలం గుర్తుకే ఓటెయ్యండి: బిల్లా కృష్ణహరి

వార్డు అభివృద్ధికి కమలం గుర్తుకే ఓటెయ్యండి: బిల్లా కృష్ణహరి

📰 Generate e-Paper Clip

-25 వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి బిల్లా కృష్ణ హరి

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 25వ వార్డు బీజేపీ అభ్యర్థి బిల్లా కృష్ణ హరి వార్డులోని పలు కాలనీల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వార్డులోని మౌలిక వసతుల కల్పనే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా వార్డులో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా తయారయ్యాయని, తాను గెలిచిన వెంటనే రహదారుల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మినరల్ వాటర్ అందేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇప్పుడు వార్డు సేవకుడిగా మీ ఇంటి కొడుకులా పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటికీ వెళ్తూ, కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!