
*ముఖ్య అతిథులుగా1, 2వ వార్డు కౌన్సిలర్లు సంగ హన్మవ్వ స్వామి ఏనుగు జ్యోతి తిరుపతి రెడ్డి*
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ మున్సిపల్ పరిధిలో శాత్రాజుపల్లి అంగన్వాడి స్కూల్లో అన్నప్రసన్న అక్షరాభ్యాసాలు కార్యక్రమం జరిగింది ఐసిడిఎస్ సీడీపీఓ సౌందర్య సూపర్వైజర్ అంజమ్మ ఆదేశాల మేరకు ముఖ్య అతిథిగా1, 2 వార్డు కౌన్సిలర్లు సంగ హన్మవ్వ స్వామి ఏనుగు జ్యోతి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు ఐదు నెలలు నిండిన చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన తొలి ముద్దను తినిపించి అన్నప్రాశన చేశారు. అదేవిధంగా, గర్భిణీలకు సాంప్రదాయబద్ధంగా శ్రీమంతం నిర్వహించి, పండ్లు, పూలు మరియు పౌష్టికాహార కిట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తల్లీబిడ్డల ఆరోగ్యమే సమాజానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తూ చిన్నారుల బరువును ప్రతిరోజూ రికార్డుల్లో నమోదు చేస్తూ, వారి ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మూడు నెలలు నిండిన గర్భిణీలందరూ తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. గర్భిణీలకు అవసరమైన ఆరోగ్య జాగ్రత్తలను వివరించడంతో పాటు, వారికి బలవర్ధకమైన ఆహారాన్ని ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందని గుర్తుచేశారు అక్షరాభ్యాసాలు నిర్వహించినారు మరియు ఐసిడిఎస్ ద్వారా పిల్లల కు యూనిఫాం డ్రెస్సులు కౌన్సిలర్ల చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు జ్యోతి అరుణ లక్ష్మినర్సమ్మ ఏఎన్ఏం శ్రీలత ఆశ వర్కర్ వసంత పిల్లలు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
